నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి’‘( Bhagavanth Kesari ).
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్స్ అందుకున్న బాలయ్య ఈ సినీరంతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు.కొన్ని పోస్టర్స్, టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు.మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది.
దసరా సీజన్ ను బాలయ్య కబ్జా చేయడంతో ఈ లోపు లోనే ఈ సినిమాపై హైప్ భారీగా పెంచేయాలని మేకర్స్ ప్లాన్ రచించారు.
షూటింగ్ లాస్ట్ స్టేజ్ కు చేరుకోగా మ్యూజికల్ ట్రీట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ఆలోచన.
ఈ క్రమంలోనే ఫస్ట్ సింగిల్ ( Bhagavanth Kesari First Single ) గురించి అప్డేట్ తెలుస్తుంది.ఈ ఫస్ట్ పాట వినాయకుడిపై ఉంటుందని థమన్ ఇప్పటికే మంచి ట్యూన్ అందించినట్టు టాక్.
మరి సెప్టెంబర్ 1న ఈ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయని ఈసారి బీజీఎమ్ ముందు కంటే అదిరిపోయే రేంజ్ లో ఇచ్చాడని టాక్…
మరి ఈ విషయం తెలియడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇక దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇక బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.