రామ్ చరణ్ కి బహుమానంగా బాహుబలి కాజా...ఫోటో వైరల్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు అరుదైన సన్మానం జరిగింది.ఎంతో ప్రేమతో తీయని బాహుబలి కాజాను బహుమానంగా అందించి రాజమండ్రి వాసులు రామ్ చరణ్ ను ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవించారు.

 Bahubali Kazha As A Gift To Ram Charan Photo Goes Viral , Ram Charan , Tollywood-TeluguStop.com

రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా మూడో షెడ్యూల్ లో భాగంగా రాజమహేంద్రవరంలో సినిమా షూటింగ్ నిర్వహించారు.

Telugu Bahubali Kazha, Rajahmundry, Ram Charan, Shankar, Shelton Hotel, Tapeshwa

ఇలా రాజమహేంద్రవరంలో సినిమా షూటింగ్ చిత్రీకరిస్తుండగా రాజమండ్రి వెళ్ళిన రామ్ చరణ్ కు తాపేశ్వరం సురుచి వారు ఘనంగా సన్మానించారు.సురుచీ పీఆర్‌ఓ వర్మ బాహుబలి కాజాను రామ్ చరణ్ కు అందజేశారు.అయితే తమ జిల్లాకు ఎలాంటి సినీ ప్రముఖులు వచ్చిన రాజకీయ ప్రముఖులు వచ్చిన వారిని ఇలా బాహుబలి కాజాతో మర్యాదపూర్వకంగా సత్కరించడం ఆనవాయితీ అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా షెల్టాన్‌ హోటల్‌లో బసచేసిన రామ్ చరణ్ బాహుబలి కాజాను బహూకరించి సత్కారం చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రామ్ చరణ్ నటించిన RRR సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కావడంతో త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube