తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి సీనియర్ నటుడిగా, కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన వయసు పైబడటంతో ఎలాంటి సినిమాలోనూ నటించలేదు.
ఇక సినిమా ఇండస్ట్రీకి దూరమైన బాబు మోహన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.అదే విధంగా పలు బుల్లితెర కార్యక్రమాలకు అతిథిగా వచ్చి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్ బాబు మోహన్ మరో సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ తో కలిసి పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు.
ఈ విధంగా వీరిద్దరూ ఈ పాటకు డాన్స్ చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన సీనియర్ సెలబ్రిటీలు అందరూ హాజరై ప్రేక్షకులను సందడి చేశారు.ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు ఎంతో మంది అద్భుతమైన డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా నటుడు బాబు మోహన్ ఈ పాటకు డాన్స్ వేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.