దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా గురువుగా పేరుగాంచడమే కాకుండా, పతంజలి ఆయుర్వేదం ద్వార ప్రజలందరికి కూడా సుపరిచితుడైన బాబా రాందేవ్, కృష్ణపట్నం ఆనందయ్య మందు పై వివాదస్పద వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ప్రాచీన కాలం నుండి అందుబాటులో ఉన్న ఆయుర్వేదాన్ని కాదని అల్లోపతి మెడిసిన్ ను ఎంకరేజ్ చేయడం పనికిమాలిన చర్య అని సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాందేవ్ పై దేశద్రోహం కేసులు పెట్టాలని వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలో ప్రధాని మోదీకి లేఖ కూడా రాసింది.కాగా వీరి వ్యాఖ్యలకు స్పందించిన బాబా రాందేవ్ నన్ను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని, ఎంత పెద్ద పదవిలో ఉన్న వారు కూడా తనను అరెస్ట్ చేయలేరని, మోదీ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారట.
అయినా ఆనందయ్య మందు బయటకు వస్తే బాబా రాందేవ్ పతంజలి కరోనా మందు పడకేస్తుందనే భయం పట్టుకుంది కావచ్చు.అందుకే ఇలాంటి కూతలు కూస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట.