మెగా స్టార్ చిరంజీవి పవర్ ఫుల్ మూవీ ఇంద్ర లో నేనున్నాను నాయన్నమ్మ అంటూ వచ్చి దుమ్ము రేపిన బుడ్డ ఇంద్ర సేనా రెడ్డి తేజ సజ్జ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఈయన హీరోగా రూపొందిన చిత్రం జాంబీరెడ్డి.
ఇండియాలో మొదటి జాంబీ మూవీగా ఈ మూవీ రికార్డు దక్కించుకుంది.థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా మంచి వసూళ్లను దక్కించుకుంది.
ఓటీటీ లో ఈ సినిమాను కూడా భారీగా నే స్ట్రీమింగ్ చేశారు.ఇక ఇటీవల స్టార్ మా లో ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేసిన సమయంలో పెద్ద ఎత్తున ఈ సినిమా కు రేటింగ్ వచ్చింది.
మొదటి సారి రేటింగ్ విషయం పెద్దగా రికార్డు కాదు.కాని సెకండ్ టెలికాస్ట్ సమయంలో రికార్డు నమోదు అవ్వడం అనేది పెద్ద రికార్డు.
ఆ రికార్డును జాంబీరెడ్డి దక్కించుకుంది.స్టార్ మా అధికారికంగా చెబుతున్న దాని ప్రకారం జాంబీ రెడ్డి భారీ టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది.
తేజ సజ్జకు జోడీగా ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా అన్ని విధాలుగా సక్సెస్ ను దక్కించుకుని తేజకు మంచి ఫ్యూచర్ ఉంది అంటూ నెటిజన్స్ అనుకునేలా చేశాడు.
ఇండస్ట్రీలో కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది.మరో వైపు ఈ సినిమా ను స్టార్ మా లో టెలికాస్ట్ చేసిన రెండవ సారి కూడా భారీ గా రేటింగ్ ను దక్కించుకుంది.జాంబీ రెడ్డి 8.1 రేటింగ్ ను స్టార్ మా లో రెండవ సారి టెలికాస్ట్ అయినా కూడా దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.గత వారంలో ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చిన ఈ సినిమాను తీసుకు వచ్చిన స్టార్ మాకు మంచి లాభం అయితే దక్కినట్లుగా తెలుస్తోంది.సినిమాను తక్కువ రేటుకే దక్కించుకున్న స్టార్ మా వారు ఈ సినిమాను కేవలం రెండు సార్టు స్ట్రీమింగ్ చేయడంతోనే లాభం దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తుంది.
అందుకే బుడ్డ ఇంద్ర సేనా రెడ్డి మళ్లీ హిట్ కొట్టాడంటూ అతడి ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.