కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అనధికారిక లాక్ డౌన్ అమలు అవుతోంది.కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తుంటే మరి కొన్ని మాత్రం ఆంక్షలు కర్ఫ్యూ అంటూ జనాలను కరోనా బారి నుండి కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సమయంలో ఇండస్ట్రీ లో కూడా ఒక రకమైన సైలెంట్ వాతావరణం కనిపిస్తుంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాప్తంగా కూడా సినిమా షూటింగ్ లు నిలిచి పోయాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో సినిమా వేడుకలు కూడా రద్దు చేసుకుంటున్నారు.కొందరు వ్యక్తిగత వేడుకలను కూడా కరోనా భయంతో వాయిదా వేసుకున్నారు.
ఈ సమయంలోనే అభిమానులు ఎంతో మంది ఆందోళనలో ఉన్నారు.కనుక తమ సినిమాలతో జల్సాలు చేసుకోకూడదు అనేది నిర్ణయానికి వచ్చారు.
ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్ సినిమా టీజర్ రావాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.కరోనా కారణంగానే టీజర్ ను విడుదల చేయకూడదనే నిర్ణయానికి రౌడీ స్టార్ వచ్చాడు.
ఈనెల 31న విడుదల అవ్వాల్సిన సర్కారు వారి పాట సినిమా టీజర్ ను కూడా వాయిదా వేశారు.టీజర్ లేదా ఫస్ట్ లుక్ వేసేందుకు ఇది సరైన సమయం కాదని అందుకే తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అభిమానులకు సూచించి వేడుకలను రద్దు చేసుకోవాలంటూ సూచించారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సామాన్యుల నుండి డబ్బున్న వారి వరకు ప్రతి ఒక్కరు కూడా కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నారు.
కనుక సినిమా ఫస్ట్ లుక్ లేదా మరేదో విడుదల చేయడం ద్వారా ఏదో హడావుడి చేయాలని భావించడం లేదు అంటూ వారు ప్రకటించారు.నిజంగానే మహేష్ బాబు మరియు విజయ్ దేవరకొండలు చేసిన పని చాలా మంచి పనంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఇద్దరిని చూసి ఇతర హీరోలు కూడా నేర్చుకోవాల్సి ఉంది కదా అంటూ నెట్టింట కొందరు కామెంట్స్ చేస్తున్నారు.