Sobhu Yarlagadda : విశ్వక్ సేన్ పై సెటైర్ వేసిన బాహుబలి నిర్మాత శోభు.. సక్సెస్ తలకెక్కకూడదంటూ?

నిర్మాత శోభు యార్లగడ్డ( Sobhu Yarlagadda ) గురించి మనందరికీ తెలిసిందే.బాహుబలి( Bahubali ) వంటి సూపర్ హిట్ సినిమాలను అందించారు.

 Baahubali Producer Shobu Yarlagadda Made A Stark Comment On An Upcoming Hero At-TeluguStop.com

ఈ సినిమాతో ఈయన క్రేజ్ పాపులారిటీ భారీగా పెరిగింది.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా రికార్డుల మొత్తం మోగించిన విషయం తెలిసిందే.

ఎంత‌లా అంటే సినిమా రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే బాహుబ‌లి రికార్డులు, నాన్ బాహుబ‌లి రికార్డులు అనేంత‌గా.అయితే ఇప్ప‌టివ‌ర‌కు కూడా అంద‌రూ ఇలానే డిస్క‌ష‌న్స్ చేసుకుంటున్నారు.

కాగా మాములుగా శోభు యార్లగడ్డ మాటకు ఉన్న విలువ వేరు.ఆయన ఆచి,తూచి మాట్లాడుతూంటారు.

Telugu Attitude, Baahubali, Tweet, Viswak Sen-Movie

ఎదుటి వ్యక్తి గురించి ఏదైనా మాట్లాడాలి అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరి మాట్లాడుతూ ఉంటారు.వివాదాలకు ఆమడ దూరంలో ఉంటారు.చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా శోభు యార్లగడ్డ ట్వీట్ చేసారంటూ ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కానీ ఆయన అకౌంట్ లో ఆ ట్వీట్ కనపడటం లేదు.అసలు ట్వీట్ చేయలేదా? లేక చేసి డిలేట్ చేసేసారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.అసలు.ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.

Telugu Attitude, Baahubali, Tweet, Viswak Sen-Movie

సక్సెస్ ని తలకెక్కనివ్వకూడదు.దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.ఈ మధ్య మంచి హిట్ అందుకున్న ఒక కొత్త నటుడు, ఒక డెబ్యూ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కనీస గౌరవం చూపలేదు.ఆ వైఖరి అతని కెరీర్‌ను బిల్డ్ చేయటంలో సహాయపడదని అతను త్వరగానే గ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను.

అంటూ శోభు ట్వీట్ చేసారంటూ ఈ పై ట్వీట్ వైరల్ అవుతోంది.అయితే ఆ ట్వీట్ చూసిన చాలామందికి వెంటనే హీరో విశ్వక్ సేన్, సాయి రాజేష్ ( Hero Vishwak Sen, Sai Rajesh )మధ్య జరిగిన వివాదం గుర్తుకు వచ్చింది.

అయితే అక్కడ శోభు యార్లగడ్డ కొత్త నటుడు అని రాసుకొచ్చారు.మరి ఆ కొత్త నటుడు ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.కొంతమంది మాత్రం అది విశ్వక్సేన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.కాగా ఆ ట్వీట్ ఆయన అకౌంటు లో లేకపోవడంతో అనేక రకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube