సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఒక ఆర్టిస్ట్ గా అషు రెడ్డి( Ashu Reddy ) తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.
తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.
చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.
ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.
ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.
ఆ తర్వాత యాంకర్ రవి( Anchor Ravi ) తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.
అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ ( Bigg boss )నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.
ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.యూట్యూబ్లో ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగ అందులో బాగా వీడియోస్ పంచుకుంటూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.ఆ ఫొటోస్ లో తను బాగా ఎక్స్పోజ్ చేసింది.
సన్నని పొరలాంటి డ్రెస్ వేసుకోగా.గ్యాప్ లో తన అందాలు మెల్లిమెల్లిగా కనిపించాయి.
ఇక ఆ ఫోటోలను చూసి తన ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ తన అందాన్ని పొగుడుతున్నారు.ఇక మరి కొంతమంది ఎప్పటిలాగే ట్రోల్ చేశారు.
ఓ నెటిజన్ ఏంటి డోర్ కర్టన్ చుట్టుకొచ్చావేంటి అంటూ తన డ్రెస్ పై ట్రోల్స్ చేస్తున్నారు.ఇక నిజానికి తను ఏ డ్రెస్ వేసిన కూడా తన అందంలో మించిన వారు ఎవరు ఉండరు అని చెప్పాలి.