ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి.అధికార వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలే మమల్ని కాపాడుతాయి అంటూ జనాల్లోకి దూసుకెళ్తుండగా, టీడీపీ మరియు జనసేన పార్టీలు వైసీపీ తప్పు ఒప్పులను, అవినీతిని ఎత్తి చూపుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.
కొంతకాలం క్రితమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తుని అధికారికంగా ప్రకటించాడు.పొత్తు ప్రకటించిన తర్వాతి నుండి రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో టీడీపీ మరియు జనసేన ఉమ్మడిగా ఎలా ముందుకు పోవాలి అనే దానిపై సమన్వయ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి.
కొన్ని చోట్ల టీడీపీ మరియు జనసేన కార్యకర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి.దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social media ) లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త అందరినీ షాక్ కి గురి చేస్తుంది.

రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ – జనసేన( TDP – Janasena ) కూటమి కి సపోర్టుగా మెగా ఫ్యామిలీ హీరోలు ఎన్నికల ప్రచారం బరిలో దిగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఈ ఎన్నికల ప్రచారం లో పాల్గొనబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.గత ఏడాది రామ్ చరణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యాడు.
కానీ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నీకు ఇలాంటి గొడవలు వద్దు, ప్రశాంతం గా సినిమాలు చేసుకో అని ఆపేసాడు.కానీ అల్లు అర్జున్ మాత్రం పాలకొల్లు జనసేన సభలో పవన్ కళ్యాణ్ తో పాటు పాల్గొని తన సంపూర్ణ మద్దతు ని జనసేన కి తెలిపాడు.
ఈసారి అలా కాకుండా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్ధం అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) రిక్వెస్ట్ మీదనే ఇది జరగోబోతున్నట్టు సమాచారం.

వాస్తవానికి టీడీపీ – జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ ఒక్కడు సరిపోతాడు.ఆయన చరిష్మా చాలు కోట్లాది మంది తెలుగు ప్రజలను కదిలించడానికి.కానీ తక్కువ సమయం ఉన్నప్పుడు అన్నీ నియోజక వర్గాలు కవర్ అవ్వాలంటే కేవలం చంద్ర బాబు మరియు పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం కాదు.పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపు ఇస్తే జనసేన కోసం ఏమి చెయ్యడానికి అయినా సిద్ధం అంటూ ఇప్పటికే రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ పలు మార్లు బహిరంగంగా తెలిపారు.
కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు.కానీ ఈసారి చంద్రబాబు నాయుడు స్పెషల్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టి ఎమన్నా ఒప్పుకుంటాడో లేదో చూడాలి.