ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టును పక్కదారి పట్టించారని పిటిషనర్లకు జరిమానా విధించింది.
ఈ మేరకు 14 మందికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.ఇళ్ల కూల్చివేత ఘటనలో షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదంటూ పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది.దీంతో తీవ్రస్థాయిలో మండిపడ్డ న్యాయస్థానం జరిమానా విధించింది.అయితే గుంటూరు జిల్లాలోని ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించిన విషయం తెలిసిందే.