Anganwadis : అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

గత ఏడాది డిసెంబర్ నుండి దాదాపు 40 రోజులపాటు ఏపీ అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లు సమ్మె చేయడం తెలిసిందే.వేతనాలు పెంచాలని.

 Ap Govt Gave Good News To Anganwadis-TeluguStop.com

ఇంకా పలు డిమాండ్లపై సమ్మె చేయడం జరిగింది.ఆ సమయంలో ప్రభుత్వంతో అనేక మార్లు చర్చలు విఫలమయ్యాయి.

అంగన్వాడి సమ్మె యూనియన్ లతో ప్రభుత్వం జరిపిన పలు విషయాలలో ఏకాభిప్రాయం కుదరలేదు.ఈ క్రమంలో ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యింది.

ఏకంగా వారిపై ఎస్మా చట్టాన్ని( Esma ) ప్రయోగించింది.అయినా గాని అంగన్వాడీలు ఎక్కడ వెనకడుగు వేయలేదు.

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.అంగన్వాడీల ( Anganwadis )ధర్నా ఉధృతంగా సాగింది.వేతనం పెంపు విషయంలో ప్రభుత్వ పెద్దలతో ఎక్కడ ఏకాభిప్రాయం కుదరటం లేదు.ఈ రకంగా ధర్నా చేస్తున్న క్రమంలో.జనవరి 22వ తారీకు ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయి.ఆ సమయంలో సమ్మె కాలంలో జీతం ఇవ్వటంతో, కేసులు ఉపసంహరణకు ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా స్పందించారు.

ఇంకా పలు అంశాలను సీఎం జగన్( CM Jagan ) దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.కాగా సమ్మె కాలంలో ఇచ్చిన మాట ప్రకారం సమ్మె కాలానికి జీతం చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

మానవత దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.సమ్మె కాలంలో జీతం చెల్లింపునకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో.

అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube