బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటి వరకు ఇతర రాష్ట్ర సమస్యలపైనా ప్రభుత్వంపై విమర్శల విష యంలోనూ సోము వీర్రాజును వాడుకున్నారు.
నిత్యం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
దీనికితోడు కాపులను మచ్చిక చేసుకునే పనిచేపట్టారు.అయితే ఇప్పుడు అనూహ్యంగా పార్టీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి రంగంలోకి దిగారు.
ఇప్పటి వరకు ఆమె ఎక్కడ ఉన్నారో కూడా తెలియలేదు.కానీ ఇప్పుడు మాత్రం.
విశాఖ ఉక్కు విషయంపై మాత్రం ఆమె బరిలో నిలబడ్డారు.

వాస్తవానికి విశాఖకు చెందిన కంభంపాటి హరిబాబు, విష్ణుకుమార్ రాజు వంటివారు విశాఖ ఉక్కుపై గళం విప్పుతారని అనుకున్నారు.అదే సమయంలో పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజు కూడా వాయిస్ వినిపిస్తారని భావించారు.కానీ, వారంతా సైలెంట్ అయ్యారు.
ఈ విషయంలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అనుకున్నారో ఏమో అనూహ్యంగా పురందేశ్వరిని రంగంలోకి దింపారని అంటున్నారు.ఇటీవల ఆమె విశాఖలోనే మాట్లాడుతూ విశాఖ ఉక్కు విషయంలో ప్రజాభిప్రాయాన్ని కేంద్రానికి వివరిస్తామని అన్నారు.
అదే సమయంలో కేంద్రం ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తుందని చెప్పారు.
అంటే పురందేశ్వరి వ్యాఖ్యలను బట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయం ముందుగానే ఏపీ నేతలకు తెలిసి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇతర నాయకులు మాట్లాడితే దీనిపై వ్యతిరేకత పెరిగే ఛాన్స్ ఉంటుందని సో పురందేశ్వరి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదనే వ్యూహంతోనే ఆమెకే విశాఖ ఉక్కు విషయాన్ని అప్పగించారని అంటున్నారు.
ఇక, పురందేశ్వరి వ్యాఖ్యలు కూడా రాష్ట్ర బీజేపీ పెద్దగా దీనిపై స్పందించే అవకాశం లేదని తెలుస్తోంది.
పైగా గతంలో ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆదిశగా ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలోనూ వ్యవహరించేందుకు పక్కా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.మొత్తానికి విశాఖ ఉక్కు విషయంలో బీజేపీ నేతలు పురందేశ్వరిని వ్యూహాత్మకంగానే బరిలోకి దింపారని ప్రచారం జరుగుతోంది.