Running Race Old Woman : 100 మీటర్ల రన్నింగ్ పోటీలో రేసుగుర్రంలా పరుగులు పెట్టిన 80 ఏళ్ల బామ్మ

ప్రస్తుత రోజుల్లో 50 ఏళ్లు దాటితే చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.బీపీ, షుగర్ వంటివి వచ్చి, రకరకాల సమస్యలతో బాధ పడుతుంటారు.

 An 80-year-old Grandmother Ran Like A Racehorse In The 100 Meter Running Competi-TeluguStop.com

వీటికి తోడు మోకాళ్ల నొప్పులతో ఎక్కువ దూరం నడవలేక పోతుంటారు.అయితే ఓ 80 ఏళ్ల బామ్మ తన ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోయింది.

పరుగు పందెంలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించింది.ఆ వయసులో అడుగు తీసి అడుగు వేయడమే కష్టం.

అలాంటిది రన్నింగ్ పోటీలలో ఆ బామ్మ రేసుగుర్రంలా పరుగులు పెట్టింది.రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసి, బంగారు పతకాన్ని సాధించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూపీలో ఇటీవల అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి.మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ మీరట్ ఆధ్వర్యంలో క్రీడా భారతి జిల్లా మీరట్, గ్లోబల్ సోషల్ కనెక్ట్ ఆధ్వర్యంలో మొదటి మాస్టర్స్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్ 2022 ఆదివారం వేద్ ఇంటర్నేషనల్ స్కూల్ భరాలా ప్రాంగణంలో పోటీలు నిర్వహించారు.పోటీలో 35 ఏళ్లు పైబడిన క్రీడాకారులు స్త్రీ, పురుషుల విభాగాల్లో పోటీల్లో పాల్గొన్నారు.అయితే వీరందరిలోనూ 80 ఏళ్ల వయసు కలిగి, 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన మహిళ బీరీ దేవి భరాలా ఈ పోటీల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.100 మీటర్ల పరుగు పందేన్ని ఆమె కేవలం 49 సెకన్లలో పూర్తి చేసింది.ఆమె కంటే తక్కువ వయసు ఉన్న వారంతా బీరీ దేవి భరాలా పరుగు పెడుతున్న విధానం చూసి ఆశ్చర్యపోయారు.చీర కట్టులో ఆమె లేడి పిల్లలా దూకుతూ పరుగు పందెంలో విజేతగా నిలిచింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.ఆమె ఈ వయసులో పరుగులు పెడుతూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube