100 మీటర్ల రన్నింగ్ పోటీలో రేసుగుర్రంలా పరుగులు పెట్టిన 80 ఏళ్ల బామ్మ

ప్రస్తుత రోజుల్లో 50 ఏళ్లు దాటితే చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

బీపీ, షుగర్ వంటివి వచ్చి, రకరకాల సమస్యలతో బాధ పడుతుంటారు.వీటికి తోడు మోకాళ్ల నొప్పులతో ఎక్కువ దూరం నడవలేక పోతుంటారు.

అయితే ఓ 80 ఏళ్ల బామ్మ తన ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోయింది.పరుగు పందెంలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించింది.

ఆ వయసులో అడుగు తీసి అడుగు వేయడమే కష్టం.అలాంటిది రన్నింగ్ పోటీలలో ఆ బామ్మ రేసుగుర్రంలా పరుగులు పెట్టింది.

రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసి, బంగారు పతకాన్ని సాధించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. """/"/ యూపీలో ఇటీవల అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి.

మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ మీరట్ ఆధ్వర్యంలో క్రీడా భారతి జిల్లా మీరట్, గ్లోబల్ సోషల్ కనెక్ట్ ఆధ్వర్యంలో మొదటి మాస్టర్స్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్ 2022 ఆదివారం వేద్ ఇంటర్నేషనల్ స్కూల్ భరాలా ప్రాంగణంలో పోటీలు నిర్వహించారు.

పోటీలో 35 ఏళ్లు పైబడిన క్రీడాకారులు స్త్రీ, పురుషుల విభాగాల్లో పోటీల్లో పాల్గొన్నారు.

అయితే వీరందరిలోనూ 80 ఏళ్ల వయసు కలిగి, 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన మహిళ బీరీ దేవి భరాలా ఈ పోటీల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

100 మీటర్ల పరుగు పందేన్ని ఆమె కేవలం 49 సెకన్లలో పూర్తి చేసింది.

ఆమె కంటే తక్కువ వయసు ఉన్న వారంతా బీరీ దేవి భరాలా పరుగు పెడుతున్న విధానం చూసి ఆశ్చర్యపోయారు.

చీర కట్టులో ఆమె లేడి పిల్లలా దూకుతూ పరుగు పందెంలో విజేతగా నిలిచింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.ఆమె ఈ వయసులో పరుగులు పెడుతూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

50 డేస్ సెంటర్ల విషయంలో పుష్ప ది రూల్ గ్రేట్ రికార్డ్.. అన్ని స్క్రీన్స్ లో రన్ అవుతోందా?