జమిలి ఎన్నికలు నిజమే .. క్లారిటీ ఇచ్చేసిన అమిత్ షా 

ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతుంది.జమిలి ఎన్నికలపై కేంద్ర అధికార పార్టీ బిజెపి ఆసక్తిగా ఉండడంతో,  దీనికి సంబంధించిన విషయాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.

 Amit Shah Clarified That Jamili Elections Are Real, Amith Sha, Central Home Mini-TeluguStop.com

ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.జమ్మూ కాశ్మీర్,  హర్యానా అసెంబ్లీ ఎన్నికలు( Jammu Kashmir and Haryana Assembly Elections ) ప్రక్రియ మొదలైంది.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈనెల 18న మొదలు కాబోతోంది.దీని తరువాత మహారాష్ట్ర , ఝార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.

ఈ నేపథ్యంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై( One Nation One Election ) కేంద్ర అధికార పార్టీ బిజెపి కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తోంది.  అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

  ఈ ఐదేళ్ల కాలంలోనే వన్ నేషన్ , వన్ ఎలక్షన్ నిర్వహించ తలపెట్టింది.  గతంలో ఈ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యసాధ్యనాలపై అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

Telugu Amitshah, Amith Sha, Bjp, Central, Haryana, Jammu Kashmir-Politics

ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.  దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ , లోక్ సభ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలంటూ కేంద్రం ఆదేశాలను జారీచేసినట్లు ఉన్నత స్థాయి అధికారులు పేర్కొంటున్నాయి .తాజాగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ( Union Home Minister Amit Shah )ఈ విషయాన్ని నిర్ధారించారు.  ప్రస్తుత మోది ప్రభుత్వ హయాంలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ న నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ విషయంపై స్పందించడంతో,  త్వరలోనే దానికి సంబంధించి ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది.

Telugu Amitshah, Amith Sha, Bjp, Central, Haryana, Jammu Kashmir-Politics

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయిన నేపథ్యంలో , మీడియాతో అమిత్ షా అన్ని విషయాల పైన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  తమ ప్రభుత్వ హాయంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు అమిత్ షా చెప్పారు .వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారధ్యంలో ఏర్పాటు అయిన కమిటీ తన తుది నివేదికను అందజేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube