ట్రంప్ విధానాలపై కోర్టుకెక్కిన అమెరికా రాష్ట్రాలు..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన వలస విధానాలు వలస వాసులకే కాకుండా, అమెరికాలోని వివిధ ప్రాంతాల అటార్ని జనరల్ కు విసుగు పుట్టిస్తున్నాయి.దాంతో ట్రంప్ తాజాగా ప్రకటించిన మరో రెండు వలస విధానాలపై దాదాపు పదిహేను రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్ వాటిని వ్యతిరేకిస్తూ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు.

 America Attorney Generals File Case Against Trump1-TeluguStop.com

ఇలా వలస విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించడం ఇది రెండోసారి గా తెలుస్తోంది.

Telugu Americagenerals, Donald Trump, Telugu Nri Ups, Trump-

  గత రెండేళ్లుగా చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్న వలస వాసులకు ఎటువంటి న్యాయసహాయం అందకుండా చేసి బలవంతంగా అమెరికా నుంచి పంపించి వేయడానికి ట్రంప్ ఇచ్చిన కీలక ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ కేసును దాఖలు చేసినట్లు అటార్నీ జనరల్స్ తెలిపారు
ట్రంప్ మానవ హక్కులను విస్మరించి, నిస్సహాయులైన వలసల పిల్లలను రాజకీయ పావులుగా ఉపయోగించుకుంటున్నారని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో క్యాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ పిటిషన్ దాఖలు చేశారు.ట్రంప్ సర్కార్ చేపడుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై తమ పోరాటం ఉంటుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్ ఆదేశాలు జారీ కాకుండా చూస్తామని అందుకే కోర్తులని ఆశ్రయిస్తున్నట్టుగా వారు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube