అమెరికాకి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన నాసా వీక్షణకోసం హైదరాబాద్ అమ్మాయి సాయి పూజిత ఎంపిక అయ్యింది.హైదరాబాద్ లో బాష్యం ఐఐటీ ఫౌండేషన్ అకాడమీ లో 9వ తరగతి చదువుతున్న సాయి పూజిత ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.
వివరాలలోకి వెళ్తే.

చెన్నై లోని గో ఫర్ గురు అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఇంటర్ నేషనల్ స్పేస్ సైన్స్ కాంటెస్ట్ -2019 లో పాల్గొని ఎంతో చక్కని ప్రతిభని కనబరిచిన ఈ అవకాశాన్ని దక్కించుకుంది.ఓ ఆధారాణ లారి మెకానిక్ అయిన సాయి పూజిత తండ్రి ఎంతో కష్టపడి తన కూతురిని చదివిస్తున్నారని, సాయి కూడా చదువులో చక్కని ప్రతిభ చూపుతుందని స్కూలు యాజమాన్యం తెలిపింది.

ఈ కాంటెస్ట్ లో దేశవ్యాప్తంగా ముగ్గురు ఎంపిక అయ్యారని, సాయి పూజిత వారిలో ఒకరని తెలుస్తోంది.వీరికి ఉచితంగా విమానయాన ఖర్చులు ఏర్పాటు చేస్తారు.వారం రోజుల పాటు ఈ బృందం అమెరికాలో పర్యటిస్తుంది.
నాసాలో జరిగే ప్రతీ పనిని ఈ బృందానికి వివరించి చెప్తారు.తన కుమార్తె అమెరికాలో నాసా కేంద్రాన్ని చూడటానికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని సాయి పూజిత తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







