తేనె పూసిన కత్తి అంటూ బిగ్ బాస్ శివాజీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమర్ దీప్!

బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారిలో వెండి తెర నటుడు శివాజీ( Shivaji ) ఒకరు అదే విధంగా బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందిన అమర్ దీప్ చౌదరి ( Amar Deep Chowdary ) కూడా ఒకరు.వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతూ చివరి వరకు హౌస్ లో కొనసాగారు.

 Amardeep Sensational Comments On Shivaji , Amardeep, Shivaji, Bigg Boss,runner-TeluguStop.com

ఇక శివాజీ టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటికి రాగా అమర్ మాత్రం రన్నర్ ( Runner ) గా బయటకు వచ్చారు.వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఇరువురు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ అదే స్థాయిలో ఇంటర్వ్యూలలో పాల్గొని విమర్శలు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరు ఇంటర్వ్యూలలో విమర్శలు చేసుకుంటూ ఉండడంతో ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారాయి ఇటీవల శివాజీ అమర్ గురించి మాట్లాడుతూ స్టార్ మా సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేసిందని తనకు రన్నర్ అయ్యే అర్హత లేదు కానీ తనని రన్నర్ చేసారు అంటూ విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలపై అమర్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తన గురించి శివాజీ ఇలా మాట్లాడారు అంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుందని తెలిపారు హౌస్ లో ఉన్నంత సేపు ఆయన నువ్వు నాకు చాలా నచ్చావురా అంటూ తనని పొగిడేవారు కానీ బయటకు వచ్చిన తర్వాత తన అసలు రంగు బయటపడిందని వెల్లడించారు.తేనె పూసిన కత్తి అంటారు శివాజీ కూడా అలాంటి వ్యక్తి అంటూ ఈ సందర్భంగా అమర్ శివాజీ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇలా వీరిద్దరూ బయటకు వచ్చినా కూడా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube