ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు( Allu Arjun ) నేషనల్ అవార్డ్ రావడంతో తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.పుష్ప ది రైజ్ ( Pushpa The Rise ) సినిమాకు అవార్డ్ రావడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ కంటే గొప్పగా నటించిన నటులు ఉన్నారని అయితే వాళ్లకు ఇవ్వకుండా బన్నీకే అవార్డ్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు.మరి కొందరు బన్నీ ఈ అవార్డ్ కోసం 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని చెబుతున్నారు.
అయితే నెటిజన్ల కామెంట్ల విషయంలో బన్నీ ఫ్యాన్స్ రియాక్షన్ మరో విధంగా ఉంది.డబ్బులతో అవార్డులు కొనేలా ఉంటే బన్నీ గత 20 ఏళ్లలో ఎన్నో నేషనల్ అవార్డులు( National Awards ) కొనేవారని వాళ్లు కామెంట్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో బన్నీ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న హీరోలు సైతం ఉన్నారని వాళ్లు తలచుకుంటే అవార్డ్ కోసం 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలరని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ వందల సంఖ్యలో సినిమాలలో నటించారని అవార్డులలో లాబీయింగ్ చేయాలని అనుకుంటే ఈ హీరోలకు కష్టమా? అని కామెంట్లు వినిపిస్తున్నాయి.నేషనల్ అవార్డ్స్ కమిటీ సభ్యులు( National Awards Committee ) బన్నీ నటనను మెచ్చి అవార్ద్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తెలుగోడికి అవార్డ్ వస్తే ఇంత విషం కక్కడం అవసరమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప1 తో నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకున్న బన్నీ పుష్ప2 సినిమాతో( Pushpa 2 ) మరో అవార్డ్ ను సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బన్నీపై విమర్శలు చేసేవాళ్లు సైలెంట్ గా ఉంటే బెటర్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.గత సినిమాల విజయాలతో, అవార్డులతో సుకుమార్ పై( Sukumar ) బాధ్యత మరింత పెరిగిందని పుష్ప 2 సినిమా స్క్రిప్ట్ విషయంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని మరి కొందరు చెబుతున్నారు.