అల్లు అర్జున్ త్వరలో మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే.ఏషియన్ సినిమాస్ వారితో కలిసి అల్లు అర్జున్ ‘ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్’ AAA మల్టీప్లెక్స్ ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు.
గత రెండు సంవత్సరాలుగా నిర్మాణం లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ మరో మూడు నెలల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ మల్టీప్లెక్స్ లో ప్రొజెక్టర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.
సౌత్ ఇండియా లో కేవలం ఒకే ఒక్క చోట ఉన్న విభిన్నమైన స్క్రీన్ ఉందని.అలాంటి స్క్రీన్ ను అల్లు అర్జున్ టీమ్ ఈ మల్టీప్లెక్స్ లో అమర్చబోతున్నారట.
ప్రొజెక్టర్ అవసరం లేకుండా సినిమా ప్రదర్శించే టెక్నాలజీ సౌత్ ఇండియా లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లోనే సాధ్యం కాబోతోంది.ఇక అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.అత్యాధునిక టెక్నాలజీ మరియు విశాలమైన లాంజ్, అద్భుతమైన సీటింగ్ వ్యవస్థ ఇలా ఎన్నో హంగులతో కూడిన ఈ మల్టీప్లెక్స్ నిర్మాణానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారనే టాక్ జోరుగా వినిపిస్తుంది.దాదాపుగా 100 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతోంది.
అల్లు అర్జున్ కంటే ముందు మహేష్ బాబు తో కలిసి ఏషియన్ సినిమాస్ వారు మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.అయితే దానికి మించిన హంగులను అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
మరో మూడు నెలల్లో అందుబాటులోకి రాబోతున్న ఈ మల్టీప్లెక్స్ అల్లు అర్జున్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలువబోతుంది.ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
త్వరలో ఫస్ట్ లుక్ తో పుష్ప 2 రాబోతుంది.