పేదల ఇళ్ల కార్యక్రమానికి టీడీపీ అడ్డంకులు సృష్టిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.అన్ని సామాజిక వర్గాలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు.
ఎన్ని అడ్డంకులు పెట్టినా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు.కోర్టు కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆమోదం తెలిపిందన్నారు.
అన్ని వసతులతో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.సీఎం జగన్ సంకల్పం ముందు దుష్టశక్తుల పన్నాగాలు నిలువలేదని వెల్లడించారు.