టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
బోయపాటి సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.యాక్షన్ తో పాటు కావాల్సినంత ఎమోషన్స్ ను కూడా మిక్స్ చేసి బోయపాటి తన సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడు.
ప్రెసెంట్ తీస్తున్న అఖండ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.
ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.
అయితే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.దీనిపై అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల కల ఇన్ని రోజులకు నెరవేరేలా కనిపిస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఈ వారాంతం లోనే వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని గట్టిగానే వినిపిస్తుంది.ఈ సినిమా నెక్స్ట్ మంత్ లోనే రిలీజ్ ఉంటే మాత్రం ఈ అప్డేట్ ఖచ్చితంగా ఉంటుందని టాక్.ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.