స్థానిక రాజమండ్రి రోడ్డు లో గల పరిణయ ఫంక్షన్ హాల్ లో జిల్లాకు సంబంధించిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్ హరి కిరణ్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.తణుకులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సందేశం ఎల్ ఈ డి ల ద్వారా వచ్చిన లబ్ధిదారులు వీక్షించారు.
మంత్రి కన్నబాబు, కలెక్టర్ హరి కిరణ్ ,ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు మాట్లాడుతూ జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల పేద ప్రజలందరికీ ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రతి ఒక్కరూ తమ గృహాలకు సంపూర్ణ హక్కుదారులు అవుతారని తమ అవసరాలకు బ్యాంకుల ద్వారా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రుణాలు పొందవచ్చని, ఇటువంటి కార్యక్రమం వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయని దురుద్దేశంతో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజల్లో అపోహ కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు .జగ్గంపేట, గండేపల్లి ,కిర్లంపూడి, గోకవరం మండలం సంబంధించిన 270 లబ్ధిదారులకు ఓటిఎస్ పత్రాలు పంపిణీ జిల్లాలో లక్ష 16 వేల మంది జగనన్న సంపూర్ణ పుర హక్కు పథకానికి అప్లై చేసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
జిల్లావ్యాప్తంగా జగ్గంపేట నియోజకవర్గం జగన్ సంపూర్ణ గృహ హక్కు పథకంలో ముందస్తు లో ఉన్నాయన్నారు.