తెలుగు సిని ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సురేఖా వాణి ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా వుంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.
తన కూతురు సుప్రీత తో కలిసి డాన్స్ లు చేస్తూ ఈ వయసులో కూడా తన అందాన్ని ఆరబోస్తూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు కూడా చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖా వాణి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
మరి ముఖ్యంగా ఆమె జీవితంలో తన భర్త చనిపోయిన క్షణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆమె తెలిపింది.
అలాగే ఆమె భర్తతో ఆమె గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఇంటర్వ్యూ లోనే ఏడ్చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఆమె భర్త తేజ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయారని, అయితే ఆమె భర్తకు చిన్నచిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ క్లియర్ అవుతాయి అనుకున్నాం కానీ ఇలా దూరమైతాడని అనుకోలేదు అని ఆమె తెలిపింది.
ఇప్పటికీ ఆ విషయం తలచుకుంటే కన్నీళ్లు వస్తాయి అంటూ ఎమోషనల్ అయింది సురేఖ వాణి.అలాగే ఆమె భర్త చనిపోవడానికి పదేళ్ల ముందు నుంచి మధుమేహం సమస్యతో బాధపడుతున్నారట.
ఆ తర్వాత నాలుగైదులకు రక్తం గడ్డ కట్టడం ప్రారంభించిందని అలా బ్లడ్ ఎక్కడపడితే అక్కడ గడ్డ కట్టేదని, ఒకసారి కాలిలో ఖాళీ వేళ్ళు తీసేయాల్సి వచ్చింది అని ఆమె తెలిపింది.అలా వేళ్ళు తీసేసిన నెల రోజుల్లోనే ఆమె భర్త చనిపోయాడట.
అయితే ఆమె భర్త చనిపోయిన సమయంలో ఆమె పక్కనే ఉందట.అయితే తన భర్త కొంచెం పిరికివాడని ఎక్కడ భయపడతాడు అని ఆర్టిఫిషియల్ వేళ్ళు కూడా పెట్టిద్దామని అనుకున్నప్పటికీ అప్పుడు బాగానే ఉంది అనటంతో ధైర్యంగా ఉన్నాము ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ప్రతిరోజు నర్స్ వచ్చి డ్రెస్సింగ్ చేసేదని, కానీ షుగర్ వల్ల లోపల గుండెల్లో సమస్య పెరిగిపోతుందని ఆమెకు తెలియలేదట అలా అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందట.చనిపోయిన రోజు ఉదయం బాగానే ఉన్నాడు కానీ నేను మార్కెట్ కి వెళ్లి వచ్చేసరికి పరిస్థితి చాలా సీరియస్ అయింది.ఆ విషయం మాకు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పేసరికి డ్రైవర్ ని హాస్పిటల్ కి తీసుకునే రమ్మని చెప్పి నేను అట్నుంచి అంటే హాస్పిటల్ కి వెళ్లాను కానీ హాస్పిటల్ కి వెళ్లి చూసేసరికి జరగాల్సినంత జరిగిపోయింది.
ఆ సమయంలో నా పక్కనే ఎవరు లేరు నేను మా డ్రైవర్ మాత్రమే ఉన్నాము అంటూ ఎమోషనల్ అయింది సురేఖ వాణి.