దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రకుల్ ప్రీతిసింగ్(Rakul Preeth Singh) ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలోని గడుపుతున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో బిజీగా ఉన్నటువంటి ఈమెకు సరైన స్థాయిలో హిట్ మాత్రం రాలేదని చెప్పాలి.
ఇలా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇలా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తే రకుల్ తాజాగా మరొక వీడియోని షేర్ చేసారు.
తాజాగా ఈమె కొత్త కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోని రకుల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.రకుల్ ప్రీతిసింగ్ తాజాగా మెర్సిడెజ్ కారును( Mercedes Benz Car ) కొనుగోలు చేశారు.రకుల్ కొత్త మెర్సిడెస్-బెంజ్ కారు విలువ దాదాపు రూ.3.50 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.ఇది చూసిన నెటిజన్స్ రకుల్ ప్రీతిసింగ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ఇప్పటికే ఈమె గ్యారేజ్ లో ఎన్నో ఖరీదైన కార్లు ఉండగా తాజాగా మరో కారును కొనుగోలు చేశారు.
ఇక ఈమె తెలుగులో చివరిగా కొండ పొలం (Konda Polam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అయితే ఈమె తెలుగు సినిమాలకు దూరమయ్యారా అన్న సందేహాలు కూడా అందరిలోనూ తలెత్తుతూ ఉండగా ఈ విషయంపై కూడా గతంలో రకుల్ స్పందిస్తూ తాను తెలుగు సినిమాలకు దూరం కాలేదని సరైన అవకాశాలు రాకపోవడంతోనే సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.