అప్పుడప్పుడు సెలబ్రెటీలు షేర్ చేసే పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ఎందుకంటే వాళ్ళ పోస్ట్లు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కాబట్టి.
ఇక వాళ్ళు ఏ పోస్ట్ షేర్ చేసుకున్న కూడా అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.చూసే జనాలు కూడా సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి వారి పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
అప్పుడప్పుడు సెలబ్రెటీలు పాత జ్ఞాపకాలను కూడా పంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా మాధవి లత( Madhavi Lata ) కూడా ఒక పోస్ట్ షేర్ చేయగా ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.
ఇంతకు అందులో ఏముందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి మాధవిలత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై అడుగుపెట్టి.ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయం అయింది.కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ దగ్గరలో ఉంది.ప్రతిరోజు తన పోస్టులతో అందరిని బాగా అలరిస్తుంది.

మాధవి తొలిసారిగా 2008లో నచ్చావులే సినిమాతో( Nachhavule Movie ) సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత స్నేహితుడు సినిమాలో నటించింది.కానీ ఎందుకో తను ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.పైగా తాను కథ ఎంచుకోవడంలో పొరపాటు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ఇక సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.నిత్యం తన సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఏదో ఒక పోస్టు తో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.ఆ పోస్టుకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటుంది.పైగా తాను కూడా అవతలి వారి పై బాగా ఫైర్ అవుతుంటుంది.

ఇక బాగా రీల్స్ కూడా చేస్తూ ఫిదా చేస్తూ ఉంటుంది.ఇక ఇప్పటికీ అంతే అందంతో బాగా కనిపిస్తూ ఉంటుంది మాధవి.కానీ అవకాశాలు మాత్రం రాలేకపోతున్నాయి.కొత్త హీరోయిన్ల రాకతో ఈమెకు అవకాశాలు రాలేకపోతున్నాయని అర్థం అవుతున్నాయి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక పోస్ట్ షేర్ చేసుకోగా అది బాగా వైరల్ అవుతుంది.
అయితే ఆ పోస్టులో ఏముందంటే లా కు సంబంధించిన తన ఐడి.ఇక ఆ ఫోటోను పంచుకుంటూ.హాహా.
అందుకే మన రూమ్ మనమే సర్దుకోవాలి.ఇలాంటి ఆణిముత్యాలు బయటపడతాయి.
కొన్ని సంవత్సరాల తర్వాత తవ్వకాల్లో.తన ఎల్.
ఎల్.బి ఐడి కార్డ్ దొరికిందని తెలిపింది.అబ్బో లైఫ్ లో మనం చాలా చేసాం అనిపిస్తది ఇలాంటప్పుడే.వి ఎస్ ఆర్ లా కాలేజ్ అని పంచుకుంది.ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవ్వగా అప్పట్లో కూడా తను చాలా అందంగా ఉంది అంటూ తన ఫ్యాన్స్ లైక్స్ కొడుతున్నారు.