టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా, సీరియళ్ల( Serials ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో కస్తూరి ఒకరు.ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచే కస్తూరి తాజాగా ఒక సందర్భంలో చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా దుల్కర్ సల్మాన్ తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించగా కస్తూరి( kasturi ) సైతం తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
ప్రముఖ సంస్థ సినిమా సెలబ్రిటీలకు( celebrities ) సంబంధించిన ఒక ఈవెంట్ ను నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు.
ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఆ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత కూడా భారీ సంఖ్యలో జనం తరలివచ్చారని కస్తూరి కామెంట్లు చేశారు.ఆ సమయంలో ఎవరో నన్ను వెనుక నుంచి నొక్కుతున్నట్లు అనిపించిందని కస్తూరి పేర్కొన్నారు.

ఈ ఘటన జరిగిన సమయంలో మా నాన్న నాతో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.నేను వెంటనే వెనక్కు తిరిగి నన్ను నొక్కుతున్న వ్యక్తిని ముందుకు లాగానని కస్తూరి కామెంట్లు చేశారు.ఆ వ్యక్తిని నేను ముందుకు లాగడంతో అతను చాలా ఏడ్చాడని కస్తూరి పేర్కొన్నారు.
అక్కా సారీ.సారీ అంటూ ఆ వ్యక్తి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడని కస్తూరి వెల్లడించడం గమనార్హం.

చేసేవి చెత్త పనులు అని అలాంటి పనులు చేసి అక్కా అని వేడుకోవడం ఎందుకని కస్తూరి కామెంట్లు చేశారు.కస్తూరి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.కొంతమంది సోషల్ మీడియాలో సైతం అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.తమ కోపాన్ని ఎక్కడ బయటపెట్టాలో తెలియక కామెంట్స్ బాక్స్ లోకి వచ్చి రచ్చ చేస్తున్నారని కస్తూరి శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.