స్టార్ హీరో బాలకృష్ణకు కోపం ఎక్కువని చెబుతూ కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.అయితే బాలకృష్ణతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు మాత్రం ఆయన చాలా మంచి మనిషి అని, కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసే విషయంలో బాలకృష్ణ ముందుంటారని చెబుతుంటారు.
తాజాగా నటి అర్చన బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అర్చన మాట్లాడుతూ తనకు టాలీవుడ్ హీరోయిన్లతో ఎవరితోనూ ఎక్కువ బాండ్ లేదని పేర్కొన్నారు.
బిగ్ బాస్ లో పాల్గొన్న ఆడవాళ్లకు తాను సపోర్ట్ చేస్తానని ఇతర హీరోయిన్లను, నటీమణులను తక్కువ చేయాలని తాను భావించనని అర్చన అన్నారు.బిగ్ బాస్ షో సీజన్1 ఆఫర్ వచ్చిన సమయంలో తన బడ్జెట్ చెప్పానని వాళ్లు అందుకు అంగీకరించారని అర్చన వెల్లడించారు.
బిగ్ బాస్ సీజన్1లో మంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారని అర్చన పేర్కొన్నారు.
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నటించడం గురించి అర్చన స్పందిస్తూ ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా షూటింగ్ చేయరని అర్చన వెల్లడించారు.
తనను రాఘవేంద్రరావు సీత అని పిలుస్తారని అర్చన అన్నారు.పాండురంగడు సినిమా షూటింగ్ సమయంలో డ్యాన్స్ కంపోజ్ చేయాలని రాఘవేంద్రరావు మైక్ ఇచ్చారని రాఘవేంద్రరావు అలా చెప్పడంతో తాను ఫ్రీజ్ అయ్యానని అర్చన అన్నారు.

బాలకృష్ణ గారికి భయపడితే నచ్చదని బాలయ్య చాలా కూల్ గా ఉంటారని అర్చన తెలిపారు.లేనిపోని డ్రామాలు చేస్తే మాత్రమే ఆయనకు ఎక్కడ లేని కోపం వస్తుందని అర్చన పేర్కొన్నారు.బాలయ్య గారు వస్తున్నారంటే స్పాట్ బాయ్స్ తెగ భయపడతారని అర్చన వెల్లడించారు.బాలయ్య చాలా మంచిగా మాట్లాడతారని అర్చన పేర్కొన్నారు.రాఘవేంద్రరావు గారికి తగినట్టు తాను సాంగ్ కంపోజ్ చేయగా ఆయన ప్రశంసించారని అర్చన వెల్లడించారు.