2024 ఎన్నికల నాటికి టిడిపి జనసేన బీజేపీ పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తాయని , ఈ మేరకు టిడిపిని కలుపుకు వెళ్లే విధంగా జనసేన పార్టీ బీజేపీని ఒప్పించబోతోంది అనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది.ఈమేరకు జనసేన, టిడిపి నాయకులు క్షేత్రస్థాయిలో ఈ విషయంలో ఒక క్లారిటీ తో ఉన్నారు.
చాలా రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అవకాశం దొరికినప్పుడల్లా బిజెపి పెద్దలను పొగుడుతూ, ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా ఆ విషయంలో బిజెపి నుంచి ఏ క్లారిటీ రాకపోవడంతో జనసేన ద్వారా పొత్తు ప్రయత్నాలు మొదలు పెట్టారనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంలో టిడిపిని కలుపుకు వెళ్లేందుకు బిజెపి ఏమాత్రం ఇష్టపడడం లేదు.
దీనిపై బిజెపిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిజెపి తో టిడిపి పొత్తు ఉండదని కొంతమంది బిజెపి నాయకులు వ్యాఖ్యానించడంపై ఆయన పరోక్షంగా స్పందించారు.పొత్తుల పై ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా , అది బిజెపి జాతీయ అధ్యక్షుడు మాత్రమే తీసుకుంటారు అంటూ పరోక్షంగా కొంతమంది బిజెపి నాయకులకు ఆయన చురకలు వేశారు.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై తాజాగా బిజెపి ఏపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ స్పందించారు.తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ పార్టీకి ఒక దశ, దిశ లేదని తెలంగాణలో పార్టీ కి తాళం వేశారని, ఏపీలో తాళం పడుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.టిడిపి వ్యవహారంపై ఢిల్లీలో స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడికే సొంత పార్టీపై విశ్వాసం లేదని, అటువంటి పార్టీతో బీజేపీకి పొత్తు ఉండదన్నారు.బిజెపిలు రాష్ట్ర ఇన్చార్జి, సహ ఇన్చార్జిలే పార్టీ అభిప్రాయం వెల్లడిస్తారని చెప్పారు .జాతీయ నాయకత్వానికి తామే కళ్ళు, చెవులు అన్నారు.తాము ఏం మాట్లాడినా, మా పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకే మాట్లాడతామన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు .కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఇప్పటికీ సన్నిహితంగా ఉన్నారని టిడిపి సహకరించడం వల్ల బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుబ్యాంకు పెరుగుదల కనిపించింది ఆయన చెప్పుకొచ్చారు.
.