తెలుగు ప్రేక్షకులకు నటుడు ప్రదీప్( Actor Pradeep ) అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ఎఫ్ 2 సినిమాలో( F2 Movie ) తమన్నా తండ్రి క్యారెక్టర్ లో నటించిన నటుడు ప్రదీప్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఈ సినిమాలో అంతేగా అంతేగా అనే ఒక్క డైలాగ్ తో భారీగా ఫేమస్ అయ్యారు.
ప్రస్తుతం ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు.ఇటీవలే స్టార్ మా లో ప్రసారమైన పల్లకిలో పెళ్లికూతురు సీరియల్లో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
రెండు జడల నాలుగు స్తంభాల లాంటి సినిమాలలో జీవితంలో హీరోగా నటించిన ప్రదీప్ ఆ తరువాత అతను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారట.
అంతేకాకుండా తన్నును నమ్మించి నమ్మిన వారే దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రదీప్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.ఒకానొక సమయంలో సంపాదించిన డబ్బులను మొత్తం పోగొట్టుకొని ఎంతో కష్టాలు అనుభవించాను.
సొంత ఇంటిని కూడా అమ్మి చివరికి అద్దె ఇంట్లో ( Rental House ) ఉండే పరిస్థితి ఏర్పడింది.నేను సంపాదించిన వేల కోట్ల ఆస్తులను ఎలా పోగొట్టుకున్నాను.
కేవలం తన కారణంగానే సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్నాను అని తెలిపారు ప్రదీప్.మంచివారు అని గుడ్డిగా నమ్మి కొందరితో వ్యాపారాలు చేయడం వల్ల తన ఇలాంటి ఈ పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత నుంచి ఎవరి గుడ్డిగా నమ్మడం మానేశానని ,జీవితానికి సరిపడా గుణపాఠం నేర్చుకున్నానని తెలిపారు.ఆ తర్వాత మంచి అవకాశాలు రావడంతో సీరియల్స్ సినిమాలలో నటించి తిరిగి తన జీవితంలో సెటిల్ అయ్యానని ప్రస్తుతానికి తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు ప్రదీప్.( F2 Pradeep ) జీవితంలో నమ్మిన వారే దారుణంగా మోసం చేయడంతో అవన్నీ గట్టిగా నిలదొక్కుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకొచ్చారు.