భీమ్లా నాయక్ హిందీ వర్షన్.. పవన్ కళ్యాణ్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తమిళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ పూనకాలు తెప్పించింది అని చెప్పాలి.

 Actor Gaurav Chopra Dubbing Artist Of Pawan Kalyan Bheemla Nayak Hindi Version D-TeluguStop.com

ఇక ఎన్నో రోజుల నుంచి పవన్ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నా ఫుల్ మీల్స్ లాంటి సినిమా భీమ్లా నాయక్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఇక భారీ విజయం సాధించిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతోంది.

అయితే తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఈ సినిమాని ఇప్పటికే విడుదల చేశారు.కానీ హిందీ లో మాత్రం ఈ సినిమా విడుదల చేయలేదు అన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటీవల హిందీలో విడుదల చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.ఇక ఇటీవలే భీమ్లా నాయక్ హిందీ వర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ఇలా తెలుగు హీరోలు తమ సినిమాలను హిందీలో కూడా విడుదల చేస్తూ ఇక స్వయంగా డబ్బింగ్ చెబుతూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.భీమ్లా నాయక్ సినిమా విషయంలో మాత్రం హిందీ వర్షన్ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పలేదట.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బాలీవుడ్ బుల్లితెర నటుడు గౌరవ్ చోప్రా డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.

Telugu Gaurav Chopra, Bheemla Nayak, Bheemlanayak, Artist, Artistgaurav, Gourav

ఈ విషయం తెలిసిన పవన్ అభిమానులు గౌరవ్ చోప్రా ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.1979 ఏప్రిల్ 4వ తేదీన న్యూఢిల్లీలో పుట్టాడు గౌరవ్ చోప్రా. చిన్నప్పుడు నుంచి సినిమాల మీద ఆసక్తితో అటు వైపు అడుగులు వేశారు.2013లో గౌరవ్ చోప్రా మొదటిసారి తమిళ సినిమాలో కనిపించాడు.ఇక 2004లో టీవీ సీరియల్ సారా ఆకాష్, కర్మా లాంటి సీరియల్ లో నటించాడు.

Telugu Gaurav Chopra, Bheemla Nayak, Bheemlanayak, Artist, Artistgaurav, Gourav

2006లో డాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు.కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు బ్లడ్ డైమండ్ లాంటి సినిమాలతో హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.ఇక తెలుగులోకి అనువాదమయ్యే హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ కూడా చెబుతూ ఉంటాడు.ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాకి డబ్బింగ్ చెప్పడం పై స్పందిస్తూ లెజెండ్ పవన్ కళ్యాణ్ కి డబ్బింగ్ చెప్పడం సంతోషంగా ఉంది గర్వంగా భావిస్తున్నాను అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు గౌరవ్ చోప్రా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube