ముంబై నుంచి చెన్నైకి షిఫ్ట్ అవుతున్న అమీర్ ఖాన్... అదే కారణమా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అమీర్ ఖాన్ ( Ameer Khan ) ఒకరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో గత మూడు సుద్దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ముంబై( Mumbai ) లో నివసిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Actor Ameer Khan Shifted Mumbai To Chennai For This Reason, Chennai Mumbai, Amee-TeluguStop.com

ఈయనకు ముంబైలో పలు ప్రాంతాలలో ఖరీదైన బంగ్లాలు కూడా ఉన్నాయి.అయితే ముంబై మహా నగరాన్ని వదిలి ఈయన చెన్నై( Chennai )లో స్థిరపడాలని భావిస్తున్నారని ఒక వార్త వైరల్ గా మారింది.

అసలు అందరూ ముంబై వెళ్ళగా ఈయన ఎందుకు చెన్నై వస్తున్నారు ఇలా చెన్నైకి మారడం వెనుక ఏదైనా కారణం ఉందా అనే విషయానికి వస్తే.

Telugu Ameerkhan, Bollywood, Chennai Mumbai-Movie

అమీర్ ఖాన్ ముంబై వదిలేసి చెన్నై రావడం వెనుక పెద్ద కారణం ఉంది ఈయన తన కోసం కాకుండా తన తల్లి గారి కోసం చెన్నై వస్తున్నారని తెలుస్తుంది.గత కొద్దిరోజులుగా అమీర్ ఖాన్ తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈమె చెన్నైలోనే ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

ఇలా హాస్పిటల్లో తన తల్లి ఉండడంతో చెన్నై వచ్చి ఆసుపత్రికి సమీపంలోనే ఒక హోటల్లో బస చేయబోతున్నారని తెలుస్తోంది.అమీర్ ఖాన్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎలాంటి సినిమాలను చేయలేదు.

దీంతో ఈ సమయంలో తన తల్లికి తన తోడు ఎంతో అవసరమని భావించారట.

Telugu Ameerkhan, Bollywood, Chennai Mumbai-Movie

అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి సహాయంగా ఉండటం కోసమే అమీర్ ఖాన్ ముంబై వదిలి చెన్నై వస్తున్నారని తెలుస్తోంది.మరి ఇక్కడ ఈయన ఎన్ని రోజులు ఉంటారు అనేది తెలియాల్సి ఉంది.అమీర్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఈయన నటిస్తున్న సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.

దీంతో సినిమాలకు కూడా కాస్త దూరంగా ఉంటున్నారు.సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత కారణాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చినటువంటి అమీర్ ఖాన్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.ఇక ఈయన చివరిగా లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచిందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube