జనసేన అధికార ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.
టీడీపీ – జనసేన పొత్తు అంశంపై నేతలతో జనసేనాని పవన్ చర్చించనున్నారు.ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై అధికార ప్రతినిధులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఈ ఎన్నికల్లో టీడీపీతో కూడా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.