యాక్షన్ కింగ్ అర్జున్ ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీలోని సునీల్ మోషన్ పోస్టర్..

‘దర్జా’ చిత్రం మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరారు యాక్షన్ కింగ్ అర్జున్. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’.

 Action King Arjun Launched Suneel Darja Movie Motion Poster Details, Action King-TeluguStop.com

సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు.కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలోని సునీల్‌ పాత్రకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ని తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేయడం జరిగింది.మోషన్ పోస్టర్ చాలా బాగుంది.

ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనిపిస్తుంది.చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్.

ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), హీరోయిన్లు అక్సాఖాన్, శిరీష. సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, సినిమాటోగ్రాఫర్ దర్శన్, స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, పీఆర్వో వీరబాబు, ‘దర్జా’ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.‘‘ముందుగా ఈ చిత్రంలోని సునీల్‌ గారి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ గారికి ధన్యవాదాలు.

ఇంతకుముందు విడుదలైన అనసూయగారి మోషన్ పోస్టర్‌లానే.ఇప్పుడు విడుదలైన సునీల్ మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది.

’’ అని అన్నారు.

Telugu Arjun, Darja Poster, Saleem Malik, Suneel, Aqsa Khan, Sireesha, Suneel Da

కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.‘‘అనసూయ గారి పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు సునీల్‌గారి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని విడుదల చేయాలని అనుకున్నప్పుడు ఎక్కడ, ఎలా చేద్దాం అని అనుకున్నాం.

అయితే ఈ మధ్య పేపర్లలో చూసినప్పుడు పోస్ట్ కోవిడ్‌లో బ్లడ్ షార్టెజ్ బాగా ఉందని గమనించడం జరిగింది.దీంతో అన్నయ్య శివశంకర్ పైడిపాటిగారితో చర్చించి, ‘దర్జా’ టీమ్ మొత్తం ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌’లో రక్తదానం చేశాము.

ఆ తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్‌ గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్‌ని విడుదల చేశాము.ఈ సందర్భంగా అర్జున్‌గారికి మా చిత్ర టీమ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

ఈ మోషన్ పోస్టర్‌కు షకీల్‌గారు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు.అనసూయ గారి మోషన్ పోస్టర్‌లానే ఇది కూడా చాలా బాగా వచ్చింది.

అంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం.’’ అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ శిరీష, కెమెరామెన్ దర్శన్ మాట్లాడుతూ.‘అర్జున్‌గారికి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు’ అని తెలిపారు.

Telugu Arjun, Darja Poster, Saleem Malik, Suneel, Aqsa Khan, Sireesha, Suneel Da

సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి… కెమెరా: దర్శన్, సంగీతం: రాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, కథ: నజీర్, మాటలు: పి.రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ, స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ, పీఆర్ఓ: బి.వీరబాబు, కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి, నిర్మాత: శివశంకర్ పైడిపాటి, స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube