యూపీలోని లక్నోలో గల హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని వజీర్ హసన్ రోడ్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలాన్ని చూసిన పోలీసులు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలను కూడా పిలిపించారు.అయితే ఓ టీవీ ఛానెల్‌లో అపార్ట్‌మెంట్ శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారనే వార్తను చూసిన ఒక యువకుడు కూడా అక్కడకు చేరుకున్నాడు.
లక్నోలోని గోమతీనగర్ ప్రాంతంలో నివసిస్తున్న మిలింద్ రాజ్ కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదువుతున్నాడు.
గోమతి నగర్‌లో ఆయనకు సొంతంగా రోబోటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది.
వివిధ రకాల రోబోలతో ప్రత్యేక ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు సాయంత్రం మిలింద్‌కు ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే, మిలింద్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని, సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి, తిరిగి తన ల్యాబ్‌కు వచ్చాడు.ల్యాబ్‌కు చేరుకున్న తర్వాత, 2:30 నుండి 3 గంటల పాటు ప్రయత్నించిన తర్వాత అతను శిధిలాలలో చిక్కకున్న వ్యక్తులను గుర్తించడానికి ప్రత్యేక పరికరాన్ని తయారు చేసి, ఆపై సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.

మిలింద్ రాజ్ మళ్లీ ఉదయం 10:00 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులతో మాట్లాడి శిథిలాల కింద ఒక వ్యక్తి ఏ దిశలో ఏ లోతులో ఉన్నాడో చెప్పగలనని వారికి తెలిపాడు.మిలింద్ తన పరికరాన్ని శిథిలాలలో ఉంచడం మొదలు పెట్టాడు.శిధిలాలలో చిక్కకున్న వ్యక్తులతో వారు ఉన్న చోట నుండి గోడను తన్నండి లేదా తనకు వినిపించేలా శబ్దం చేయమని అడిగాడు.
మిలింద్ తెలిపిన ప్రకారం లోపలి వ్యక్తులు శబ్ధం చేశారు.

అలాగే బాధితులు ఊపిరి పీల్చుకున్నారు మరియు కొందరు మమ్మల్ని రక్షించండి అని అరిచారు.ఈ గొంతులు విన్న తర్వాత అతను తన పరికరం సాయంతో బాధితులు ఉన్న ఖచ్చితమైన ప్రదేశాన్ని కనుగొన్నాడు.దీంతో ఆ స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు.
మిలింద్ చేసిన ఈ ప్రశంసనీయమైన ప్రయత్నం కారణంగా, శిథిలాల కింద చిక్కుకున్న సుమారు 5 మందిని సకాలంలో గుర్తించగలిగారు.వారిని రెస్క్యూ వర్క్ చేయడం ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మిలింద్ రాజ్‌ను అక్కడున్నవారంతా అభినందించారు.