మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మధ్యలో రాజకీయాల వల్ల వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు వరుసగా ట్రీట్ ఇస్తున్నాడు.గత దసరాకు గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.
ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

మెగాస్టార్ ను చాలా ఏళ్ల తర్వాత అలా చూసిన మెగా ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు.ఈయన డ్యాన్స్, స్టైల్, డైలాగ్స్ అన్ని కూడా పాత మెగాస్టార్ ను చూసినట్టు ఉంది అని కామెంట్స్ వినిపించాయి.అలాగే బాబీ సినిమా తెరకెక్కించిన విధానం కూడా సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హంగామా చేస్తూనే ఉంది.

రిలీజ్ అయ్యి 15 రోజులు అవుతున్న ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.మరి ఈ సినిమా ఇంత సక్సెస్ అయిన నేపథ్యంలో భారీ సక్సెస్ మీట్ ను జనవరి 28న హనుమకొండలో ప్లాన్ చేసిన సంగతి విదితమే.అయితే తాజాగా ఈ ఈవెంట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
ఈ గ్రాండ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా భాగం కాబోతున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.







