టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేసు నుంచి తప్పించుకునేందుకు సుమారు 15 మంది ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్ కార్డులు మార్చి పుణ్యక్షేత్రాలకు తిరిగినట్లు సిట్ అధికారులు విచారణలో గుర్తించారని సమాచారం.అయితే కేసు నుంచి ఇకపై తప్పించుకోలేమని గ్రహించిన దంపతులు సిట్ ఎదుట లొంగిపోయారని తెలుస్తోంది.
కాగా ఈ నెలాఖరులో మరో పది మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేయనుంది.అదేవిధంగా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా రెండో ఛార్జ్ షీట్ కూడా సిట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
అయితే పేపర్ లీక్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి అని సిట్ ఇప్పటికే తేల్చిన సంగతి తెలిసిందే.కాగా ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు 90 మందికి పైగా అరెస్ట్ అయ్యారు.