భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీపీఐ నేతల బృందం కలిసింది.రాష్ట్రపతితో సమావేశం ముగిసిన అనంతరం ఆ పార్టీ నేత నారాయణ మాట్లాడుతూ మణిపుర్ పరిస్థితులను రాష్ట్రపతికి వివరించామని తెలిపారు.
దేశంలో ప్రధానమంత్రి మోదీ గ్రాఫ్ పడిపోతుందన్న నారాయణ ఎన్నికలు వస్తున్నాయనే కేంద్రం వంట గ్యాస్ ధరలను తగ్గించిందని అన్నారు.అంతేకాకుండా వ్యతిరేకంగా ఉన్నవారిపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ క్రమంలో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్పాలని సూచించారు.
బీజేపీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.సొంత ప్రయోజనాల కోసం ఆరాటపడుతూ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు.