బిర్యానీ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌... ఒక్క రూపాయి నోటు ఇస్తే బిర్యానీ ఇస్తారట అక్కడ?

నోరూరించే అదిరిపోయే చికెన్ దమ్ బిర్యానీ( Chicken biryani ) కేవలం ఒకే ఒక్క రూపాయి నోటుకే దొరుకుతుందంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఎవ్వరూ ఈ ఆఫర్ ని మిస్ చేసుకోరు.అయితే ఆ బిర్యానీ మీరు కూడా రుచి చూడాలంటే ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లాల్సిందే.

 A Bumper Offer For Biryani Lovers... If You Give A Single Rupee Note, They Will-TeluguStop.com

అవును, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ రెస్టారెంట్‌ ఓపెనింగ్‌ సందర్భంగా.ఒక్క రూపాయి నోటుకు బిర్యానీ అంటూ ఆఫర్‌ ప్రకటించారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ‘ఒక్క రూపాయికే బిర్యానీ( One rupee note )’ అని ఫ్లెక్సీ ప్రదర్శించారు.దాంతో బిర్యానీ ప్రియులు.

రూపాయ్‌ నోటుతో ఆ రెస్టారెంట్‌కు క్యూ కట్టారు.

మండుటెండను కూడా వారు లెక్కచేయలేదు.

జనాలు భారీస్థాయిలో ఎగబడడంతో రెస్టారెంట్‌( Restaurant ) యాజమాన్యం షట్టర్‌ క్లోజ్‌ చేసింది.ఫలితంగా.

బిర్యానీ ప్రియులు.ఎండలో పడిగాపులు కాయాల్సి వచ్చింది.అయితే.తలుపులు మూసివేసిన రెస్టారెంట్‌ సిబ్బంది.రూపాయి నోటు తెచ్చుకున్నవారికి మాత్రమే చిన్న కౌంటర్‌ ఏర్పాటు చేసి పార్శిల్‌ రూపంలో బిర్యానీ ప్యాకెట్లు అందజేసింది.ఇక పాత రూపాయి నోటు తెస్తేనే ఒక చికెన్ బిర్యానీ అంటూ షరతులు కూడా పెట్టారు.

అలాగే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టారు.మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకూ మాత్రమే అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

అయినా జనం ఏ మాత్రం తగ్గలేదు సరికదా తమ ఇంట్లో ఓ మూలన పడేసి వున్న పాత రూపాయి నోట్లను పట్టుకుని మరీ అక్కడికి వెళ్లారు బిర్యానీ కోసం.పాత రూపాయి నోట్లతో కూడా జనం భారీగా రావడంతో రెస్టారెంట్ యాజమన్యం బిత్తరబోయింది.అయితే కాసేపటికే సదరు రెస్టారెంట్ వండిన మొత్తం బిర్యానీ అయిపోవడంతో ఇక చేసేదేమిలేక రెస్టారెంట్‌ను యజమాని కాసేపటికే రెస్టారెంట్ ని క్లోజ్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube