మెహర్ రమేష్ దర్శకత్వంలో మహేష్ బాబు

మెహర్ రమేష్ … ఈ పేరు వింటే చాలు .ఇటు నిర్మాత అశ్వినీదత్ కు .

 Meher Ramesh To Direct Mahesh Babu-TeluguStop.com

అటు ఎన్టీఆర్ కు నిద్రపట్టదు.కంత్రి .శక్తి .ఒకదాన్ని మించిన డిజాస్టర్ మరొకటి.సరే రెండు పొరపాట్లు జరిగాయి అనుకోవడానికి వీల్లేదు.ప్రభాస్ బిల్లా, వెంకటేష్ షాడో .రెండూ అపజయాలే .కనీసం బిల్లా ప్రభాస్ స్టయిల్ గురించి చెప్పుకోవడానికైనా ఉంటుంది .షాడో వెంకటేష్ కేరీర్లో అత్యంత ఘోరమైన సినిమా

ఈ దర్శకుడు మహేష్ బాబుకి మంచి మిత్రడు .పోకిరి చిత్రానికి రచనా విభాగంలో పనిచేసాడు కూడా మెహర్.మీకు గుర్తుంటే మహేష్ కి స్నేహితుడిగా “బాబి” చిత్రంలో కనిపిస్తాడు.ఇండస్ట్రీలో ఇద్దరి స్థానాలకి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉన్నా … అవేవి అలోచించని స్నేహం ఇద్దరి మధ్య ఉంది.

ఇప్పుడు అదే స్నేహంతో తనని డైరెక్ట్ చేసే అవకాశం మెహర్ కి ఇచ్చాడు సూపర్ స్టార్

ఇక్కడిదాకా చదవగానే మహేష్ అభిమానులకి చెమటలు పట్టుంటాయి కదా! ఇది రూమర్ కాదు .నిజంగా నిజమే.అయితే మెహర్ రమేష్ మహేష్ బాబుతో సినిమా తీయట్లేదు .మహేష్ బాబుని ఒక యాడ్ లో డైరెక్ట్ చేయబోతున్నాడు అంతే! ఆ ప్రకటన పూర్తవగానే మళ్ళీ ఎవరిదారి వారిదే

కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు .మహేష్ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానేసాడు .ఎంత స్నేహితుడైనా మెహర్ చేతిలో తన సినిమా పెట్టే రకం కాదు మహేష్ .అదేదో అంటారు చూడండి .తమ్ముడు తమ్ముడే .పేకాట పేకాటే .అలా అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube