అంజలి కష్టపడుతోంది

తెలుగమ్మాయి అంజలి తాజాగా నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్‌’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందనే విషయం తెల్సిందే.ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.

 Anjali To Slim Down For Dictator Movie-TeluguStop.com

అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.అంజలి ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అంజలిని తాజాగా దర్శకుడు శ్రీవాస్‌ బరువు తగ్గాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది.అందుకే అంజలి ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉంది.

బరువు తగ్గడంతో పాటు, గత సినిమాలతో పోల్చితే మరింత స్టైలిష్‌గా కూడా ఉండాలనే నిర్ణయానికి అంజలి వచ్చింది.ఇప్పటి వరకు ఎక్కువగా ట్రెడీషనల్‌ డ్రెస్‌లతో అలరించిన అంజలి బరువు తగ్గి మోడ్రన్‌ డ్రస్‌లు, స్కర్ట్‌లు వేయాలనే నిర్ణయానికి వచ్చింది.

‘డిక్టేటర్‌’లో అంజలిని తప్పకుండా కొత్తగా చూస్తాం అని సినీ వర్గాల వారు చెబుతున్నారు.బాలయ్య 99వ సినిమాగా తెరకెక్కుతున్న ‘డిక్టేటర్‌’పై నందమూరి ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి.

దీంట్లో అంజలిని తీసుకోవడం నందమూరి ఫ్యాన్స్‌కు పెద్దగా ఇష్టం లేదు.అయితే సినిమా చూసిన తర్వాత అంజలిని తీసుకోవడం మంచి నిర్ణయమే అనేట్లుగా ఈమె తయారు అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube