నిన్ను వదలా...జయా...!

‘నిన్ను వదలా బొమ్మాళి ‘ అన్నట్లుగా కర్నాటక ప్రభుత్వం ‘నిన్ను వదలా జయా’ అంటోంది.ఆమె అక్రమాస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తీర్పు చెప్పి శిక్ష వేసినా, హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 Karnataka To Appeal In Supreme Court This Week-TeluguStop.com

పద్దెనిదేళ్లు సాగిన ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం జయను దోషిగా తేల్చడంతో ఆమె ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకున్నారు.కాని హైకోర్టు పుణ్యమా అని మళ్లీ పదవి సంపాదించుకున్నారు.

హైకోర్టు తీర్పును రాజకీయ నాయకులతోపాటు న్యాయ కోవిదులు కూడా తప్పుపట్టారు.ఆమె ఆస్తుల విలువలను తప్పుగా లెక్కంచి, గణాంకాల్లో గందరగోళపడి అనుకూలంగా తీర్పు ఇచ్చారని గగ్గోలు పెట్టారు.

కేసుకు ఆద్యుడైన డాక్టర్‌ సుబ్రహ్మణ్య స్వామి, డీఎంకే అదినేత కరుణానిధి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆచార్య తదితరులు సుప్రీం కోర్టుకు వెళ్లాలని అన్నారు.దీంతో సుప్రీంలో అప్పీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఇక్కడ ఉన్నది కాంగ్రెసు సర్కారు కాబట్టి జయ పనిపట్టాలని నిర్ణయించుకుంది.సుప్రీంలో ఎన్నాళ్లు విచారణ జరుగుతుందో, తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పలేం.

సుప్రీంలో కేసు ఆమె వ్యతిరేకులకు సంతోషం కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube