టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవర(Devara).ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
పార్ట్ 2 (Part 2)ఉందని అది త్వరలోనే వస్తుంది అంటూ దర్శకుడు కొరటాల శివ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా కొరటాల శివ ఈ సినిమా సక్సెస్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పార్ట్ 2లో జాన్వీ(Jhanvi) పాత్ర అసాధారణంగా ఉంటుంది.
ఆశ్చర్యపోతారు.మొదటి భాగం కంటే రెండోభాగం చాలా పవర్ ఫుల్గా ఉంటుంది.
సినిమా చూసే ప్రేక్షకులు సీట్ ఎడ్జికి వస్తారు.ఒక దర్శకుడిగా నేను పార్ట్ 2 విషయంలోనూ ఎంతో నమ్మకంగా, ఆసక్తిగా ఉన్నాను.
కథలో అసలు మలుపు పార్ట్ 2లోనే ఉంది.ప్రతీ పాత్ర హైలో ఉంటుంది.ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నాను ల్.పార్ట్1లో మీరు చూసింది 10 శాతమే, రెండో భాగంలో 100శాతం చూస్తారు.
ప్రతీ పాత్రలో ట్విస్ట్ ఉంటుంది.కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి.ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను.తారక్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు.అతడు తన పాత్రకు జీవం పోస్తాడు అని కొరటాల శివ దేవర 2 (Koratala Shiva Devara 2)విషయంలో ధీమా వ్యక్తం చేశారు.అయితే కొరటాల శివ మాటలను బట్టి చూస్తే పార్ట్ 2 అంతకుమించి ఉండబోతుందని అర్థమవుతోంది.
మరి పార్ట్ 2 విడుదల అయ్యి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి మరి.