తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నటులు చాలామంది ఉన్నారు.నిజానికి తెలుగులో ఒక స్థాయి దర్శకులు తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా యంగ్ హీరోల విషయంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఇక నాని( Nani) ప్రస్తుతం ‘సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram )’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

మరి ఈ సినిమా తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో( Srikanth Odela) మరొక సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన దసరా సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో దానికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల కూడా సక్సెస్ అయ్యాడు.ఇక ఇలాంటి క్రమంలో నానితో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ఎదురుచూస్తుంటే ఆయన మాత్రం దర్శకులకే రిపీటెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఈ క్రమంలో కొత్త దర్శకులు నానితో చేయాలనుకొని మంచి కాన్సెప్ట్ లను రాసుకొని ముందుకు సాగుతున్నప్పటికీ వాళ్ళ అంత పెద్దగా శ్రద్ధ చూపించినట్టుగా కనిపించడం అయితే లేదు.

ఇక ఇప్పటికైనా మంచి కాన్సెప్టు లు ఉన్న మరి కొంతమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగుంటుందని నాని అభిమానులు గాని సినీ మేధావులుగాని కోరుకుంటున్నారు.నిజానికి నాని లాంటి స్టార్ హీరో చాలామంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.కాబట్టి ఇంకా కొంతమంది దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగుంటుందని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక నాని చాలా మంది దర్శకులను పరిచయం చేస్తున్నాడు…
.