పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పెండెం దొరబాబు( Dora Babu ) వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఇటీవల ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి దొరబాబు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని, జనసేనలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్న దొరబాబు చివరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు దొరబాబు ప్రకటించారు.
తాను రాజకీయ స్వలాభం కోసం కాదని , పిఠాపురం నియోజకవర్గ ( Pithapuram Constituency )అభివృద్ధి తన లక్ష్యమని దొరబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యం, సరైన గుర్తింపు లేకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్టు దొరబాబు ప్రకటించారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని , ప్రజలకు మంచి జరగాలన్నదే తన కోరిక అని చెప్పారు.గత కొద్ది రోజులుగా దొరబాబు రాజీనామా వ్యవహారం పై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా చేసిన ప్రకటనతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.త్వరలోనే టిడిపి , జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమిలోని ఏదో ఒక పార్టీలో తాను చేరుతానని దొరబాబు క్లారిటీ ఇచ్చారు.
తనుకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని, అనుచరులతో చర్చించిన తరువాతే భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో 25 ఏళ్లుగా మమేకం అయినట్లుగా ఆయన చెప్పారు.తన వెంట ఇప్పటి వరకు నడిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు .తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు అని చెప్పారు పిఠాపురంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానన్నారు. మాజీ సీఎం జగన్ ( Former CM Jagan )తో తనకు ఎటువంటి ఇబ్బందులు, విబేధాలు లేవని ప్రకటించారు.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు.2024 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటికి దిగడంతో, దొరబాబుకు జగన్ టికెట్ నిరాకరించి వంగ గీతకు ఆ సీటు ఇవ్వడంపై అప్పట్లోనే దొరబాబు అసంతృప్తి చెందారు.అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంటున్న దొరబాబు తాజాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.