రాజన్న సిరిసిల్ల జిల్లా: మహిళల,విద్యార్థినిల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని,మహిళ భద్రతయే పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత అని,విద్యార్థిని విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు విద్యార్థులకు పిలుపునిచ్చారు.విద్యార్థులని చైతన్య పరచాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు మహిళ రక్షణ, షీ టీమ్స్,ఈవ్ టీజింగ్ , పొక్సో , సైబర్ క్రైమ్స్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వ్యాప్తంగా షిటీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినీలు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదన్నారు.
మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని,మైనర్ బాలికల పై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ వారిని సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని ఎస్పీ తెలిపారు.
విద్యార్ధిని విద్యార్ధుల సోషల్ మీడియా(ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్)కు దూరంగా ఉండాలని,ప్రస్తుతం మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు,సోషల్ మీడియా వేధింపులు ఆన్లైన్ వేధింపులు సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, విద్యార్థి దశనుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణ పట్టుదల ఓపికతో కష్టపడినప్పుడు మంచి విజయాలు సాధిస్తారన్నారు.
చదువుకునే యుక్త వయస్సు లో యువతులు ప్రలోభాలు, ఆకర్షణలకు గురై భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని జీవితంలో ప్రతి స్టేజ్ ముఖ్యమే అని ఈరోజు మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారు అంటే మీ తల్లిదండ్రులు ఏదో రకంగా కష్టపడి పని చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగిందని ఎప్పుడు మర్చిపోకూడదని తల్లిదండ్రులను అర్థం చేసుకొని గౌరవిస్తూ వారి కళలను నెరవేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డిఎస్పీ చంద్రశేఖర్, సి.ఐ కృష్ణ,షీ టీం ఏ.ఎస్.ఐ ప్రమీల, షీ టీం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.