కేసిఆర్ హరీష్ కు కోర్టు నోటీసులు.. ఎందుకంటే ? 

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ( KCR )కు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిన దగ్గర నుంచి కష్టాలు మొదలయ్యయని చెప్పవచ్చు.

 Court Notices To Kcr Harish Because, Brs, Kcr, Telangana Government, Telangana E-TeluguStop.com

  పార్టీకి చెందిన ఎంతోమంది నేతలు కాంగ్రెస్ లో చేరిపోగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మితమైన సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు , అనేక వ్యవహారాలపై విచారణలకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఆదేశించడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.తాజాగా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి వ్యవహారాలను తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్,  మాజీమంత్రి హరీష్ రావుతో( former minister Harish Rao ) పాటు మరికొంతమందికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.

Telugu Congress, Kcr Harish, Hareesh Rao, Telangana-Politics

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం భారీ గా దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లాకు చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిలో కేసీఆర్,  హరీష్ రావుతో పాటు, ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధినేత మేఘ కృష్ణారెడ్డి,  ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎమ్ఓ కార్యదర్శి స్మిత సబర్వాల్,  ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘ కృష్ణారెడ్డి( Megha Krishna Reddy ), ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరి రాం, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ లను ప్రతివాదులు గా చేర్చారు.

Telugu Congress, Kcr Harish, Hareesh Rao, Telangana-Politics

 ఈ కేసులో కేసీఆర్ , హరీష్ రావు తో పాటు , మరో ఆరుగురికి కోర్టు నోటీసులు ఇచ్చింది.వచ్చే నెల 5వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.కాలేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ కుంగడం తో రాజలింగమూర్తి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.కానీ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో పోలీసులు దానిపై కేసు నమోదు చేయలేదు .ఈ విషయమై కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్పీ , డీజీపీలతో తోపాటు ఎవరికి ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదని జిల్లా కోర్టును ఆశ్రయించడంతో , సరైన ఆధారాలు లేవని జిల్లా కోర్టు లో ఈ పిటిషన్ ను కొట్టివేయగా,  దీనిపై హైకోర్టుకు వెళ్లారు.హైకోర్టు సూచనలతో మళ్లీ జిల్లా కోర్టులో అన్ని ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో జిల్లా కోర్టులో సెప్టెంబర్ ఐదున ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కావలసిందిగా హరీష్ రావు , కేసీఆర్ తో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube