అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకోవద్దు.. జో బైడెన్‌కు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) – మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ( Donald Trump )మధ్య చర్చా కార్యక్రమం వాడివేడిగా జరిగింది.ఇందులో చాలా వరకు ట్రంప్ డామినేషన్ కనిపించింది.

 Joe Biden's Family Urges Him To Stay In Us Presidential Race , Us Presidential-TeluguStop.com

మాజీ అధ్యక్షుడితో పోలిస్తే బైడెన్ తేలిపోవడంతో ఆయనను రేసు నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.అయితే బైడెన్ కుటుంబం ఆయనకు మద్ధతుగా నిలిచింది.

రేసులోనే ఉండాలని , తప్పుకోవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

Telugu Donald Trump, General, Joebidens, York Times, Joe Biden-Telugu NRI

డిబేట్‌లో పేలవ ప్రదర్శన తర్వాత బైడెన్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన పనితీరును గ్రహించారని అయినప్పటికీ మరో నాలుగేళ్లు సేవ చేయడానికి సరిపోతారని నివేదిక పేర్కొంది.రేసులో ఎలా కొనసాగాలి అన్న దానిపై బైడెన్ సిబ్బంది కసరత్తు చేస్తున్నారని.మీడియా సమావేశం లేదంటే ఇంటర్వ్యూ ఇవ్వడంపై చర్చలు జరుపుతున్నారని, కానీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని న్యూయార్క్ టైమ్స్( New York Times ) నివేదించింది.బైడెన్‌ని అధ్యక్ష బరిలో ఉండమని వేడుకుంటున్న బలమైన గొంతుకలలో హంటర్ బైడెన్ ఒకరు.

అధ్యక్షుడి మనవరాళ్లలో ఒకరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో మాట్లాడటం ద్వారా బైడెన్ ప్రచారానికి సహకరించాలని భావిస్తున్నారని సదరు కథనం వెల్లడించింది.

Telugu Donald Trump, General, Joebidens, York Times, Joe Biden-Telugu NRI

మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు( general elections ) కొన్ని నెలల ముందు బైడెన్ పనితీరు డెమొక్రాటిక్ పార్టీని అప్రమత్తం చేసినట్లయ్యింది.బైడెన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన డెమొక్రాటిక్ పార్టీ దాత జాన్ మోర్గాన్ ఇటీవల చర్చా కార్యక్రమాలను పర్యవేక్షించిన అధ్యక్షుడి సలహాదారులపై భగ్గుమన్నారు.అయితే డిబేట్ తర్వాత బైడెన్ కుటుంబ సభ్యులు కలత చెందారనే వాదలను వైట్‌హౌస్ అధికారి ఒకరు తోసిపుచ్చారు.

కొంతమంది డెమొక్రాట్లు కూడా బైడెన్ సిబ్బందిని అతని వైఫల్యాలకు నిందించడం సరికాదని చెబుతున్నారు.అయితే సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్‌తో కలిసి ఫోటో షూట్‌లో పాల్గొనాలని బైడెన్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

హంటర్ బైడెన్‌పై అభియోగాల తర్వాత ఫ్యామిలీ మొత్తం ఒకచోటకు చేరడం ఇదే మొదటిసారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube