ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ( BRS party ) పడుతున్న ఇబ్బందులు అన్నీ .ఇన్ని కావు.
మూడోసారి హ్యాట్రిక్ ఖాయం అనే అంచనాతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉండేవారు.కానీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చాయి.
మూడో స్థానానికి పరిమితం అయ్యింది అనుకున్న కాంగ్రెస్.ఊహించని విధంగా ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది.
ఇక కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ,రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు కాంగ్రెస్ లో చేరిపోతుందడం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.పార్టీ ఈ విధంగా బలహీనం అవుతున్నా.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఈ విషయం పై సీరియస్ గా ఫోకస్ పెట్టకపోవడం తో ఈ వలసలకు బ్రేకులు పడడం లేదు.
ఇప్పటికే కేసీఆర్ ( KCR )ఈ వ్యవహారంతో దృష్టిసారించి, పార్టీ ఎమ్మల్యేలు, కీలక నాయకులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి , ఎవరూ తొందరపడి పార్టీ మరొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని, మళ్ళీ బీఆర్ఎస్ పాలన వస్తుంది అంటూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్( KTR ) మాత్రం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ కీలకంగా యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాల పైన స్పందించేవారు.
కానీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో , ఆయన సైలెన్స్ కి కారణం ఏమిటి అనేది బి ఆర్ ఎస్ నేతలకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కేటీఆర్ ను తప్పించి,హరీష్ రావుకు కేటాయించాలానే డిమాండ్.పెరుగుతోంది. ఇప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉండడంతో హరీష్ రావు ఒక్కరే హోదాలో పార్టీకి పునర్ వైభవం తీసుకు రాగలరనే నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.