టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( AP CM Chandrababu Naidu ) ఢిల్లీ టు ఖరారు అయింది.ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో చంద్రబాబు భేటీ కానున్నారు .
ఈ మేరకు ఈనెల నాలుగో తేదీన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు అయింది.ప్రధాని మోదీ , ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్( Finance Minister Nirmala Sitharaman ) తో భేటీ సందర్భంగా ఏపీ ప్రయోజనాల గురించి చంద్రబాబు చర్చించనున్నారు.
ముఖ్యంగా విభజన హామీలతో పాటు, ఆర్థిక అంశాల పైన ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ కుసంబంధించిన అనేక ప్రతిపాదనల పైన కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం.
కేంద్రం ఆమోదించే బడ్జెట్ లో ఏపీకి గతం కంటే ఎక్కువ నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారట.
విభజన హామీలను వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీతో( Prime Minister Modi ) పాటు , కేంద్ర మంత్రులను చంద్రబాబు కోరనున్నారు.అలాగే పెండింగ్ బకాయిలు , రావలసిన నిధుల విషయంలోనూ కేంద్ర పెద్దలను ఒప్పించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు .ఈ భేటీ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఒక క్లారిటీ వస్తే , రాష్ట్ర బడ్జెట్ పై ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ప్రధాని మోది మూడోసారి ప్రధానంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీకి సంబంధించిన ప్రయోజనాలపై చర్చించేందుకు చంద్రబాబు తొలిసారిగా ఢిల్లీకి వెళ్తున్నారు.
దీంతో ఆయన పర్యటనపై సర్వత్ర రాజకీయ వర్గాల్లోనూ, ఏపీ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.ఏపీ ఎన్నికల కు ముందు టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేసే ప్రక్రియను చంద్రబాబు మొదలుపెట్టారు. దీనికి భారీగా నిధులు అవసరం కావడంతో, కేంద్ర సాయం తప్పనిసరి కానుంది .ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఏపీని గాడిలో పెట్టడంతో పాటు, ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలను అమలు చేసేందుకు భారీగా నిధులు అవసరం ఏర్పడింది.ఈ క్రమంలోనే చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తి పెంచుతోంది.